నేడు గవర్నర్ తో పవన్ కల్యాణ్ భేటీ

  • 12 గంటలకు సమావేశం
  • పలు అంశాలపై చర్చించనున్న పవన్
  • ట్విట్టర్ లో వెల్లడించిన జనసేన
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈ మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన వెలువడింది. "జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలుస్తారు" అని వెల్లడించింది. కాగా, ఈ భేటీ ఎందుకోసమన్న వివరాలు వెల్లడి కాలేదు. అయితే, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఇసుక సమస్య తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Twitter
Governer

More Telugu News